సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్ల బాటపట్టారు. ఉద్యోగాలు, వ్యాపారాలపేరిట నగరంలో స్థిరపడినవారు పండుగను స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఇండ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఏపీలోని గుంటూరు, విజయవాడ, తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర జిల్లాలకు ప్రజలు బయలుదేరుతున్నారు. వాహనాల సంఖ్య పెరిగి రహదారులు రద్దీగా మారాయి. టోల్ గేట్ దాటేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే మందుస్తు ఏర్పాట్లుచేసింది. గతంలో పోల్చితే ఈసారి ప్రత్యేక రైళ్ల సంఖ్యను 80 శాతం పెంచినట్టు ప్రకటించింది.
పల్లెకు పోదాం..చలోచలో