సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకరైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి నుంచి మూడు సర్వీసులు కాకినాడకు, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ఒక రైలు, సికింద్రాబాద్ నుంచి మరో అదనపు రైలు విజయవాడకు ప్రకటించారు. ఈ రైళ్లు ఆదివారం అందుబాటులో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పండుగ కోసం నగరం నుంచి ప్రత్యేక రైళ్లు..